Sale!

Aadhyathmik AdhiSesh Locket Nag Kavach White Metal Pendant 1inch 5grams For Sarp Dosh Nivaran Rahu Kethu Dosh Nivaran – S9058-131

995.00

Description

 

Aadhyathmik AdhiSesh Locket Nag Kavach White Metal Pendant For Sarp Dosh Nivaran Rahu Kethu Dosh Nivaran

తక్షణమే వరాలందించే ఆదిశేషు కవచం

పురాణాల ప్రకారం పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పమే ఆదిశేషుడు. సర్పాలకు ఆద్యుడు, రారాజు. కనుక సర్పదోషం, నిద్రలో సర్పాలు కనిపించేవారికి, సర్పభయంతో బాధపడేవారు ఆదిశేషుని కవచాన్ని ధరించి “నమస్తే దేవ దేవేశ నమస్తే ధరణీధర, నమస్తే సర్ప నాగేంద్ర ఆదిశేష నమోస్తుతే” అనే శ్లోకాన్ని పఠించడం ద్వారా ఆ భయాందోళన నుండి విముక్తి పొందగలరు.

కొన్ని చోట్లలో ఐదు తలలతో, మరికొన్ని చోట్లలో ఏడు తలలతో దర్శనమిచ్చే ఆదిశేషుడు నిజానికి వెయ్యి తలలగలవాడని, పదివేల తలలు గలవాడని ఆదిశేషుని గురించి పురాణాలలో పలువిధాలుగా వర్ణించబడి లోక రక్షకుడైన శ్రీమహావిష్ణువుకు మెత్తటి పాన్పు అయిన ఆదిశేషుని కవచాన్ని ధరించి ఆదిశేషుని శ్లోకాన్ని పఠించడం వలన ధనం నాలుగు వైపులనుండి వస్తుంది.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒకచోట సర్పాలలో ఆదిశేషుడు తన అంశే అని చెబుతాడు. కనుక ఈ ఆదిశేషు కవచాన్ని ధరిస్తే శ్రీకృష్ణుడి కవచాన్ని ధరించినదానితో సమానం. ఈ కవచధారణ చేసి శ్లోకపఠనం చేసినవారికి నీతి, నిజాయితి ఎల్లప్పుడూ అండగావుండి వీరిని ఎవరూ మోసం చేయకుండా రక్షిస్తాడు ఆదిశేషువు.

రాముడి సోదరుడు లక్ష్మణుడు ఆదిశేషుని అంశగా అవతరించాడని గోస్వామి తులసీదాసు తన “రామచరిత మానస్” లో వివరించాడు. కనుక ఈ ఆదిశేషుని కవచధారణ చేసి శ్లోకం పఠించేవారికి కుటుంబంలో ఐకమత్యం కలుగుతుంది. తాత, అవ్వ, అమ్మ, నాన్న, సోదర, సోదరిమణులు, భార్య / భర్త, పిల్లలతో ఇల్లు నిండుగా ఆనందంగా ఉంటుంది.

అలాగే బలరాముడు, నిత్యానంద ప్రభువు, పతంజలి కూడా ఆదిశేషువు అంశలే అని చెప్పబడివుంది. కనుక ఆదిశేషుని కవచధారణ చేసి శ్లోకం పఠించడం వలన ఇటువంటి మహామహుల ఆశీస్సులతో జీవితంలో అభివృద్ధి, పరిపూర్ణ ఆరోగ్యం, ప్రభుత్వ కార్యాలలో జయం, ముఖ్యంగా రాజకీయాలలో ఉన్నవారికి ప్రజాబలం కలుగుతుంది.

ఆదిశేషునికి పరోపకార బుద్ధి చాలా ఎక్కువ. ఇతరులకు ఎలా ఉపకారం చేయాలో సెలవివ్వమని భగవంతుణ్ణి కోరుకున్నాడు. నీవు భూభారాన్ని మోయుము. ఇతరులకు ఇంతకు మించిన ఉపకారం లేదు అని వరం ఇచ్చాడు స్వామి. అప్పటినుండి ఆదిశేషుడు మన భూమియొక్క భారాన్ని ఇప్పటికీ మోస్తూనే ఉన్నాడు. కనుక భూమికి సంబంధించిన పనులు చేసేవారు, వ్యవసాయధారులు, పొలం / తోటపనులు చేసేవారు, పొలం / భూమికి సంబంధించిన పనిముట్లకు సంబంధించిన వ్యాపారం చేసేవారు తప్పక ఆదిశేషుని కవచాన్ని ధరించి శ్లోకం పఠించడంవలన పంట బాగా చేతికంది అంతులేని లాభాలను చవిచూస్తారు. అలాగే భూమిపై వాహనం నడిపేవారు అంటే ఆటో, టాక్సీ, బస్, లారీ డ్రైవర్లు తప్పక ఈ కవచధారణ చేస్తే శుభం.

భూమిలో నిధులు కోసం వెతికేవారు తప్పక ఆదిశేషుని కవచాన్ని ధరించి శ్లోకపఠనం చేసి తీరాల్సిందే.

ఆదిశేషుడు అంశయైన వాసుకి అనే సర్పం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు తాడులా ఉపయోగపడింది. వాసుకి సహాయం లేకపోతే మనకు అమృతంతోపాటు లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం మొదలైనవి లభించేది కాదు. కనుక ఆదిశేషుని కవచాన్ని ధరించి శ్లోక పఠనం చేసేవారు సర్వ సంపదలు కైవసం చేసుకోగలరు.

-విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి