Description
మురళీ
శ్రీకృష్ణుడి లీలావతారాలు భాగవతం ప్రకారం ఇరువై రెండు (22) ఉన్నాయి. శ్రీమహావిష్ణువు లీలావతారాలలో ఇరువదవ అవతారం శ్రీకృష్ణావతారం. ఈ లీలావతారాలు ఇరవైరెండింటిలోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి. ఈ పదింటిని దశావతారాలు అంటారు. ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగ కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు.
శ్రీకృష్ణుడు తన మురళీగానంతో లోకంలోని యావత్తును తన వైపుకు ఆకర్షించుకున్నాడు. కనుక మురళీ అంటే పిల్లనగ్రోవి ఉన్న చోట ఆకర్షణ శక్తి పెరుగుతుంది. తద్వార జనాకర్షణ కలుగుతుంది. తద్వార ధనాకర్షణ కలుగుతుంది.
మురళీ ఉన్న ఇంట రోగాలు దరిచేరవు, ఆరోగ్యం కలుగుతుంది. మురళీని పూజ గదిలో ఉంచుకోవడంవల్ల సర్వసౌఖ్యాలను కలుగజేస్తుంది.
కర్మ అంటే నా కోరికలను తీర్చుకోవటము. కృష్ణుడి కోరికలను తీర్చటమును భక్తి అంటారు. కృష్ణుడి కోరికను నెరవేర్చాలి అని మీరు నిర్ణయం తీసుకుంటే, మీ జీవితం విజయవంతమవుతుంది. ఇది మన కృష్ణ చైతన్య జీవితము. కృష్ణుడి యొక్క కోరికలను నెరవేర్చడానికి బృందావన పౌరులందరూ తపిస్తున్నారు. గోపబాలురు, దూడలు, ఆవులు, చెట్లు, పువ్వులు, నీరు, గోపికలు, వృద్దులు, యశోదమ్మ, నంద మహారాజు, వారు అందరూ కృష్ణుడి కోరిక నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నారు. ఇది బృందావనము కాబట్టి మీరు ఈ భౌతిక ప్రపంచాన్ని బృందావనములోకి మార్చుకోవచ్చును మీరు కృష్ణుడి యొక్క కోరికలను నెరవేర్చడానికి అంగీకరిస్తే మీ ఇల్లు బృందావనము అవుతుంది. అంటే సర్వ వాస్తు దోషాలు, సర్వ దుష్టగ్రహ దోషాలు తొలగిపోతాయి అని అర్థం. ఇది భౌతికము మరియు ఆధ్యాత్మికమునకు మధ్య తేడా. ఈ తేడాను మీరు గుర్తించాలంటే మురళీ మీ పూజగదిలో ఉండి తీరాల్సిందే. తద్వారా ఇంట సంతోషాల హరివిల్లు వికసిస్తుంది.
వివాహ ఆటంకాలు తొలగాలన్నా కోరుకున్న స్త్రీ / పురుషుడితో వివాహం కావాలన్నా మురళీ మీ పూజగదిలో ఉండి తీరాల్సిందే.
పిల్లలు చదువుకునే గదిలో మురళీని అమర్చితే వారు చక్కగా చదువుతారు. చదివింది ఒంటపడుతుంది. “ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః” అనే మంత్రమును ప్రతి నిత్యం పఠించండి.
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి