Description
కైలాస రక్ష
యోగానికి ఆదిగురువు శివుడు. శివుడు తన జ్ఞానాన్ని కైలాసములోనే శక్తి రూపంలో దాచి ఉంచాడు. అందుకే కైలాసాన్ని శివుని స్వస్థలం అని చెపుతారు. శివుడు అక్కడే కూర్చుని ఉన్నాడని అర్థం కాదు. ఆ కొండలో తన జ్ఞానాన్ని, శక్తిని, కృపని నిక్షిప్తం చేసి పెట్టాడని అర్థం. కైలాస రక్షను లాకెట్ లాగ ధరిస్తే అపారమైన జ్ఞానం కలుగుతుంది.
శివకుటుంబానికి పవిత్ర నిలయం కైలాసం. కనుక కైలాస రక్ష ధరించినవారికి గణపతి, కుమారస్వామి, పార్వతి పరమేశ్వరులు, నంది, నాగుల ఆశీస్సులు లభిస్తాయి. సర్వాటంకాలు తొలగుతాయి. సర్వమంగళాలు కలుగుతాయి. ఇంట శుభకార్యాలు జరుగుతాయి.
కైలాస రక్ష ధరించడంవలన నరదృష్టి బాధల నుండి విముక్తి కలుగుతుంది. బాలారిష్టదోషాలు కూడా పోతాయి.
భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఈ రక్షను ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.
కైలాస రక్షను ధరిస్తే జనాకర్షణ కలుగుతుంది. కనుక ఈ రక్షను ధరించి మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వ్యక్తి దగ్గరకు వెళ్ళి అడిగితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇచ్చేస్తాడు.
పఠించాల్సిన మంత్రం :- “ఓం నమశ్శివాయ నమః”
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి