Sale!

Aadhyathmik Pranavakshara Rudraksha Raksha Pendant 1inch 1gram – S9058-108

995.00

Description

 

ప్రణవాక్షర రుద్రాక్ష రక్ష

త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ప్రణవాక్షరం. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. ప్రణవాక్షరం శబ్దాలలో మొదటిది. దాన్ని గ్రహించగలిగినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.

ఒకానొక కల్పకాలంలో రుద్రుడు అగణిత దివ్య వత్సరాలపాటు ధ్యానతత్పరుడై ఉండిపోయాడు. ఆయన తపస్సు చాలించి కళ్ళు తెరవగానే, ఆయన నేత్రాలనుండి రాలిన కొన్ని బాష్పాలు గౌడ, మధుర, అయోధ్య, కాశీ వంటి క్షేత్రాల యందు – మలయ; సహ్యాద్రి పర్వతాలయందు పడి – కాలాంతరాన అవే రుద్రాక్షలుగా పరిణమించాయి.

(రుద్రుడి అక్ష భాగము (కన్ను) నుండి రాలిపడినందువల్ల; రుద్ర (దుఃఖములను) క్షయము( నాశనము చేయు గుణము కలిగినందువల్ల వీటికి రుద్రాక్షలనే పేరు సార్ధకమైంది.

ఇంతటి మహిమాన్వితమైన ప్రణవాక్షరం మరియు రుద్రాక్ష కలిసి ఒకే రక్షలో ధరించడంవలన కలిగే ఫలితాలు అంతా ఇంతా కావని పెద్దల మాట.

రుద్రాక్షధారణ ఆరోగ్యరీత్యా కూడా ఎంతో మంచిది. వ్యాధులు – బాధలు ఉండవు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.

ప్రణవాక్షర రుద్రాక్ష రక్ష ధారణ క్షయ, మూర్ఛ రోగ నివారిణి. కాలేయాన్ని, రక్తాన్ని శుభ్రపరుస్తుంది.

ప్రణవాక్షర రుద్రాక్ష కవచ ధారణ వలన జీవితంలో ఆనందం, పేరు-ప్రఖ్యాతలు, సంపద, జ్ఞానం, విజయం, దీర్ఘాయుష్షు, పిల్లలు, మనవళ్ళు, మునుమనవళ్ళను చూసే యోగం కలుగుతుంది.

ముత్యాలు, రత్నాలు, నగలు, ఇన్సురెన్స్, సెల్ ఫోన్, యాత్రా నిర్వహణ, మార్బల్స్, గ్రానైట్స్, స్వీట్స్, కిరాణా, పత్రిక, పబ్లికేషన్, టి.వి. మొదలగు మీడియా, ఆయుర్వేదం, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యార్థులు, టీచర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, కోళ్ళ పెంపకం, బెల్లం, రచయితలు, జర్నలిజం, ఆడిటింగ్ మొదలగు రంగాలలో వృత్తి వ్యాపారం చేసేవారు ప్రణవాక్షర రుద్రాక్ష కవచాన్ని ధరించడం లాభదాయకం. ఓం ఒక ప్రణావాక్షరం అదే ఒక ఏకాక్షర మంత్రము.

– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి