Description
బాహుబలి స్ఫూర్తి శివలింగ కవచం
‘శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు‘, ‘శివాలయం లేని ఊరు స్మశానంతో సమానం‘, ‘శివలింగం లేని ప్రాంతం జీవనయోగం కాదు‘, ‘శివలింగం లేనిచోటంటూ ఎక్కడా లేదు‘, ‘ఈ ప్రపంచమంతా శివమయం‘, ‘ఈ సృష్టియావతు శివమయం‘ ఇలాంటి ఎన్నోలోకోక్తిలను, నానుడిలను మనం వినేవుంటాం. ‘శివ‘ అంటే “మంగళం” అని అర్థం. కనుక ఈ బాహుబలి స్ఫూర్తి శివలింగ కవచాన్ని ధరించినవారికి సర్వమంగళాలు కలుగుతాయి.
శివుడు ఉన్నచోట శక్తి ఉంటుంది. కనుక శివలింగం ఉండే ఇంట శివశక్తులు ఏకమై సకలశుభాలు అందిస్తారు. సృష్టిలో ఆదిదంపతులు శివపార్వతులే వివాహ సందర్భంలో వధువుచే చేయించే పూజకూడా గౌరీ పూజయే! తొలి ముత్తైదువ పార్వతీదేవి! కనుకనే బాహుబలి స్ఫూర్తి శివలింగ కవచాన్ని ధరించినవారికి అన్యోన్య దాంపత్యాన్ని, పార్వతీదేవి అనుగ్రహాన్ని, దీర్ఘసుమంగళిత్వాన్ని కలిగిస్తుంది.
మూడు భాగాలుగా విభజింపబడిన శివలింగంలో క్రిందిభాగం బ్రహ్మదేవునకు, మధ్యభాగం విష్ణుమూర్తికి, ఊర్ధ్వభాగం మహేశ్వరుడికి సంకేతము, అంటే శివలింగం త్రిమూర్తుల స్వరూపము. కనుక బాహుబలి స్ఫూర్తి శివలింగ కవచధారణ ద్వారా త్రిమూర్తుల అనుగ్రహం ఆశీస్సులు భక్తులపై సదా ఉంటాయి. సృష్టి ఆదిలో శివుడే ఐశ్వర్యేశ్వరస్వామిగా అవతరించి లక్ష్మీ కుబేరులకు ధనాన్ని ధనాధిపత్యాన్ని అందించాడు. కనుక బాహుబలి స్ఫూర్తి శివలింగ కవచధారణ ద్వారా లక్ష్మీకుబేరుల అనుగ్రహంతో ధనధాన్యాది సకల సంపదలు చేకూరుతాయి.
సకల విఘ్నాలను తొలగించే గణపతికి ఆ శక్తి శివపార్వతులను ప్రదక్షిణం చేయడం ద్వారానే కలిగింది. అంటే పరోక్షంగా వినాయకునికి విఘ్నాలను తొలగించే శక్తిని ప్రసాదించింది మహేశ్వరుడే అనడంలో సందేహం లేదు. కనుక బాహుబలి స్ఫూర్తి శివలింగ కవచాన్ని ధరించినవారికి వినాయకుడి అనుగ్రహాన్నికూడా కలిగించి చేపట్టిన ప్రతి కార్యాన్ని నిర్విఘ్నంగా నడిపించి దిగ్విజయాన్నికలిగిస్తుంది.
తారకాసుర సంహారానంతరం కుమారస్వామి సర్ప ఇతర దోష నివారణకు ఆరాధ్యదైవమయ్యాడు. కుమారస్వామి శక్తులకు కారణం మహేశ్వరుడే. కనుక ఈ బాహుబలి స్ఫూర్తి శివలింగ కవచాన్ని దేవుని మందిరంలో ఉంచి 3 సార్లు “ఓం నమశ్శివాయ నమః’ అని ధ్యానిస్తూ ఉద్ధరిణిలోని పరిశుభ్రమైన జలంతో ముమ్మారు అభిషేకించడం ద్వారా ఆ కుటుంబాన ఉండే సకల దోషాలు తొలగిపోయి, పాపాలు నిర్మూలనమై, వివాహాది శుభకార్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది.
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి