Description
కల్పవృక్ష రూపు
కల్పవృక్షము కోరిన కోరికలు ఇచ్చే చెట్టు. ఇది దేవతలు దానవులు కలిపి చేసిన క్షీర సాగర మథనం సమయంలో పుట్టింది. దీనిని దేవతలకు రాజైన ఇంద్రుడు గ్రహిస్తాడు.
ఎవరి జాతకములోనైనా గురు గ్రహము నీచ స్థానములో ఉంటే వారు విద్యను సరిగా నేర్చుకోలేరు. ఏ పని మీద ధ్యాస పెట్టలేరు. అలాంటి వారు కల్పవృక్ష రూపును ధరించినట్లైతే మంచి తెలివితేటలు కలుగుతాయి. మెదడు బాగా పనిచేసి ఆత్మవిశ్వాసం పెరిగి ఏ పనినైనా చేయగలిగే సామర్థ్యం కలుగుతుంది.
గృహములో విపరీతమైన నష్టములు చేకూరినపుడు, మనఃశాంతి లేకపోవటం, దారిద్ర్యము వదలకపోవటం లాంటివి ఉన్నప్పుడు ఉత్తర దిక్కులో లేక తమ పూజగృహంలో ఈ కల్పవృక్ష రూపును ఉంచినట్లైతే శుభ ఫలితములు ఆ గృహములో కలుగుతాయి.
భార్యాభర్తల మధ్య అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. సంతానవృద్ధి కలుగుతుంది.
వ్యాపారము అభివృద్ధి చేయదలచిన వారు తమ తమ వ్యాపారములలో శీఘ్ర లాభ ఫలితములు పొందగోరువారు, వ్యాపారములో రాబడి కంటే ఖర్చు అధికంగా ఉన్నవారు ఈ కల్పవృక్ష రూపును తమ గల్లాపెట్టెలో ఉంచినట్లైతే సరైన మంచి లాభములు పొందుతారు.
ఎవరి వద్ద కల్పవృక్ష రూపు ఉంటే వారు కోరుకున్న కోరికలు చిటికెలో నెరవేరుతాయి అని మన పురాణాలలో చెప్పబడింది. ఇక్కడ కోరికలంటే మంచి కోరికలు అని అర్థం. అభివృద్ధిని కలిగించే జీవితాశయం, సమాజ సేవ, లోకకళ్యాణార్థం కలిగించే కోరికలు సులభంగా నెరవేరుతాయి. మన మనో ఇంద్రియములను ఉత్తేజపరచి మన జీవితముకు ఉత్సాహము, మనకు వివేకము కలుగచేసి మనము అనుకున్న మంచి పనులు నేరవేరే శక్తిని మనకు అందిస్తుంది.
“ఓం నమఃశ్శివాయ” ఇదే పంచాక్షరీమహామంత్రం. ఇది యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం.
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి